వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

  • లేకపోతే చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ హెచ్చరిక
  • వాహనాదరులకు అవగాహన కల్పించిన డీటిఓ.సురేష్ కుమార్

ప్రతిపక్షం, జూన్ 24, వనపర్తి ప్రతినిధి: వాహనదారులు హెల్మెట్(Helmets) తప్పనిసరిగా ధరించాలి అని జిల్లా రవాణా శాఖ అధికారి సురేష్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయం వద్ద వాహనదారులకు ఆయన హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భం డీటిఓ. సురేష్ కుమార్ మాట్లాడుతూ…చాలామంది వాహనదారులు హెల్మెట్ ధరించలేక ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.హెల్మెట్ ధరించకపోవడంతో ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలై చివరి నిమిషంలో చికిత్స అందగా మృతి చెందారని పేర్కొన్నారు.నాణ్యమైన హెల్మెట్ ఉపయోగించాలని…స్ట్రాప్ గడ్డంపై ఉంచేందుకు అనువుగా ఉండేలా హెల్మెట్ ఎంపిక చేసుకోవాలన్నారు.హెల్మెట్ వాడటం వల్ల ప్రమాదాలు జరిగిన తలకు అయ్యే గాయల తీవ్రతను తగ్గిస్తుందని… దుమ్ము, ధూళి, ఎండ నుంచి రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుకాల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని, పాడైన లేదా పగిలిన హెల్మెట్ ఉపయోగించకూడదని అన్నారు. ఈ అవగహన కార్యక్రమంలో AMVI. శ్రీకాంత్, సైదులు, కానిస్టేబుల్ సంతోష్ కుమార్ ఉన్నారు.

Spread the love

Related News

Latest News