ప్రతి పక్షం, దుబ్బాక ఏప్రిల్ 9: మహనీయుల జన్మదిన ఉత్సవాలను జయప్రదం చేయాలని మంగళవారం మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్మ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు ర్యాగట్ల చందు పిలుపునిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 11వ తేదీన పీడిత ప్రజల విముక్తి ప్రదాతలైన మహాత్మ జ్యోతిరావుపూలే, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, కాన్సీరాం ల జన్మదిన ఉత్సవాలను పురస్కరించుకుని జరగబోయే భారీ సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, మండల అధ్యక్షులు దీపక్, మండల ఉపాధ్యక్షులు రవి, మండల ప్రధాన కార్యదర్శి నవీన్, కార్యదర్శి కనకరాజు, అక్బర్ పేట భూంపల్లి మండల అధ్యక్షులు కనక మల్లేశం, కమిటీ సభ్యులు బాలు, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.