గోవింద నామస్మరణతో మారుమోగిన నిర్మల్ వీధులు..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్ ఏప్రిల్ 24 : గోవిందా హరి గోవిందా వెంకటరమణా గోవిందా..అంటూ.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం రాత్రి స్వామి వారి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానం నుంచి ప్రతి ఏడు రథోత్సవాన్నినిర్వహించుకోవడం ఆనవాతీగా వస్తుంది. రథోత్సవాన్ని పురస్కరించుకొని వేలాది గా తరలివచ్చిన భక్తులు సాంప్రదాయ పద్ధతులలో కోలాటలాడడం, భక్తి గీతాలు, నృత్యాలు చేయడం లాంటిది ఎంతగానో ఆకట్టుకుంది. నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పలువురు కౌన్సిలర్లు, ఆలయ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీధర్, ధర్మకర్తలు ముందుగా ఆలయ ముఖ ద్వారం ముందర రథానికి వేద పండితుల మంత్రచరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి గోవింద నామస్మరణ చేస్తూ ప్రారంభించారు.
దేవరకోట దేవస్థానం నుంచి ప్రారంభమైన ఈ రథోత్సవం పట్టణంలోని గుల్జార్ మార్కెట్, చింతకుంట వాడ, కస్బా బాగులవాడ కొత్త బస్టాండ్ పాత బస్టాండ్ తదితర ప్రాంతాల గుండా సాగుతూ.. ఆలయానికి చేరుకుంది అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను భక్తులు స్వీకరించారు. నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, పట్టణ సీఐ అనిల్ రూరల్ ఆధ్వర్యంలో రథోత్సవ శోభాయాత్రలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలలో పోలీస్ వికెట్లను ఏర్పాటు చేసి అనుక్షణం పర్యవేక్షణ చేపట్టారు. ప్రభుత్వాలను పురస్కరించుకొని ఆలయంలో దీపాలంకరణ, అశ్వమేధాల రథ శోభాయాత్ర, పల్లకి ఊరేగింపు, తదితర కార్యక్రమాలను వేద పండితుల సలహా సూచనల ప్రకారము నిర్వహిస్తూ భక్తులంతా స్వామి వారి కృపకు పాత్రులైన అన్ని విధాల సౌకర్యాలను కల్పిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీధర్ ఈ సందర్భంగా తెలిపారు.