Trending Now

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేసిన కలెక్టర్

ప్రతిపక్షం, ప్రతినిధి హనుమకొండ, మే 15: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ బుధవారం పరిశీలించారు. హనుమకొండ జిల్లా పరిధిలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్ పరిశీలించి అక్కడి రికార్డులను తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల షట్టర్ల తాళాలకు వేసిన సీళ్ల ను కలెక్టర్ తనిఖీ చేశారు.

ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లకు సంబంధించిన లాగ్ బుక్ లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఉన్న సీసీ కెమెరాల పర్యవేక్షణకు సంబంధించిన వాచ్ రూమ్ ను కలెక్టర్ పరిశీలించారు. పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూములు, భద్రత ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ వివరాలను ఆయా నియోజకవర్గాల ఏఆర్వోలు డాక్టర్ కె. నారాయణ, వెంకటేష్ లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ తో పాటు తహసిల్దార్లు విజయ్ కుమార్, జగన్మోహన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Related News