ప్రతిపక్షం, సినిమా: బాలీవుడ్ దిగ్గజ సింగర్ పంకజ్ ఉదాస్ కన్నుముశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కాసేపటి క్రితం కన్నుమూసిన్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1970 లో తొలిసారి తుమ్ హసీన్ మై జవాన్ లో బాలీవుడ్ లోకి ఎంట్రి ఇచ్చిన ఆయన.. ఎన్నో ఏళ్లుగా తన గాత్రంతో అలరించారు. గుజరాత్ లోని జెట్ పూర్ లో జన్మించిన ఆయన సేవలను గుర్తించిన కేంద్రం 2006లో పద్మశ్రీతో సత్కరించింది.