ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఉత్కంఠ రేపుతోన్న ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సమయం ఆసన్నమైంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో అన్ని పార్టీల నేతల్లో ఆసక్తి నెలకొనగా.. ఇప్పుడు ఎగ్జాట్ ఫలితాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల కమిషన్.. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి.. ఆ తర్వాత ఈవీఎంలను తెరవనున్నారు అధికారులు.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. 33 కేంద్రాల్లోని 401 హాళ్లలో ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. శాసనసభ బరిలో 2,387 మంది, లోక్‌సభ బరిలో 454 మంది ఉన్నారు. అసెంబ్లీ బరిలో వైసీపీ 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. కూటమిలోని టీడీపీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ, బీజేపీ 10 ఎమ్మెల్యే, ఆరు పార్లమెంట్, జనసేన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో బరిలోకి దిగాయి.