Jani Master: జానీ మాస్టర్‌కు మరో బిగ్ షాక్.. మళ్లీ రిమాండ్!

Another big shock to Jani Master: జానీ మాస్టర్‌ తన అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ని వేధించాడనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర సమాచార ప్రసారాల శాఖమంత్రిత్వ శాఖ ఆయనకు జాతీయ అవార్డుని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా, మరో బిగ్ షాక్ తగిలింది. తన అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. అయితే అవార్డు తీసుకునేందుకు ఆయనకు రంగారెడ్డి కోర్టు 4 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు అవార్డు నిలిపివేయడంతో జానీ బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు. దీంతో ఆయనను మళ్లీ రిమాండుకు తరలించే అవకాశం ఉంది. దీంతో జానీ మాస్టర్‌ కి మరో పెద్ద షాక్‌ తగిలినట్టయింది.

Related News

Latest News