ప్రతిపక్షం, ఆగస్టు 22: దోషులను కాపాడేందుకు, న్యాయానికి అడ్డుపడేందుకు కేంద్రంలోని మోదీ-షా ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత యువతపై జరిగిన దాడులకు బాధ్యులైన వారిని ఎలాంటి పరిణామాలు ఎదుర్కోకుండా రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
యువతపై ప్రాణాంతక దాడులకు సూత్రధారులుగా వ్యవహరించిన వారు తమ చర్యలకు ఎలాంటి పరిణామాలు ఉండవని భావిస్తే అది వారి అతిపెద్ద పొరపాటని రాహుల్ గాంధీ హెచ్చరించారు. బాధ్యులను కాపాడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు న్యాయమే గెలుస్తుందని స్పష్టం చేశారు.
యువతకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దోషులపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన డిమాండ్ చేశారు.





























