[t4b-ticker]

రాహుల్‌ గాంధీకి కేటీఆర్‌ ప్రశ్నలు.. తెలంగాణలో విద్యార్థులపై లాఠీచార్జ్‌పై ఎందుకు ధర్నా చేయరు?

ప్రతిపక్షం, ఆగస్టు 22, హైదరాబాద్‌: ఢిల్లీలో విద్యార్థుల సమస్యలపై ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నలు సంధించారు. తెలంగాణలో విద్యార్థులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం లాఠీచార్జ్‌ చేసిన ఘటనలపై రాహుల్‌ గాంధీ ఎప్పుడు ధర్నా చేస్తారని ప్రశ్నించారు.

విద్యార్థులపై నిజమైన ప్రేమ ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ నివాసం ముందు ధర్నా చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు ఢిల్లీలోని విద్యార్థులకు మాత్రమేనా? తెలంగాణ విద్యార్థులకు వర్తించవా? అని నిలదీశారు.

ఢిల్లీలో ఒక నీతి, తెలంగాణలో మరో నీతి అన్నట్లుగా కాంగ్రెస్‌ వ్యవహరిస్తోందని కేటీఆర్‌ విమర్శించారు. విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్‌ నాయకత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు.

Spread the love

Related News

Latest News