Trending Now

India vs England 5th Test Day 2: రెండో రోజు లంచ్‌ బ్రేక్‌.. గిల్‌, రోహిత్‌ సెంచరీల మోత

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రెండో రోజు ఆటను టీమిండియా దూకుడుగా ఆరంభించింది. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సెంచరీతో చెలరేగాడు. 154 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రోహిత్‌కు ఇది 12వ టెస్టు సెంచరీ. ఓవరాల్‌గా ఇది 48వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. మరోవైపు శుబ్‌మన్‌ గిల్‌ సైతం తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 137 బంతుల్లో గిల్‌ సెంచరీని పూర్తి చేశాడు. లంచ్‌ విరామానికి టీమిండియా స్కోర్‌: 264/1. భారత్‌ ప్రస్తుతం 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

Spread the love

Related News

Latest News