Rahul criticizes BJP and RSS during his visit to America: అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడ వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. వర్జీనియాలోని హెర్న్‌డాన్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత్ అంటే అన్నీ ప్రాంతాల సమాహారం అని అన్నారు. బీజేపీ మాత్రం అలా చూడటం లేదన్నారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ ముందు నుంచే వ్యతిరేకం అని అన్నారు. తాను మోదీని ద్వేషించనని అన్న రాహుల్.. అలా అని ఆయన అభిప్రాయాలతోనూ ఏకీభవించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత దేశంలో భయానికి చోటు లేదని చెప్పారు. బీజేపీ ఏజెన్సీల ద్వారా భయాన్ని వ్యాప్తి చేసిందని, కానీ ఒక్క క్షణంలో అది అంతా కరిగిపోయిందని, వారి మానసికత, ప్రణాళికలన్నీ ఇప్పుడు చరిత్రగా మిగిలాయన్నారు.
కాగా.. అమెరికా నుంచి రాహుల్ చేస్తున్న విమర్శలపై భాజపా నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. విదేశీ గడ్డపై దేశం పరువు తీసేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, వాషింగ్టన్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ పలువురు చట్టసభ్యులు, సీనియర్ అధికారులతో సమావేశం కానున్నారు.