Trending Now

హైటెక్ సిటీకి పునాది వేసింది.. ఆయన ఆలోచనే..

మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: హైటెక్ సిటీకి పునాది రాజీవ్ గాంధీ ఆలోచనలేనని మీడియా సమావేశంలో జగ్గారెడ్డి తెలిపారు. 70 ఏళ్లలో ఏం చేశారు అని అడిగే కేటీఆర్, హరీష్ , బీజేపీ నేతలు విషయం తెలుసుకోవాలని ఆయన సూచించారు. టెలికమ్యూనికేషన్స్ ని ప్రజలకు అందించిన ఘనత రాజీవ్ గాంధీదేనని.. జైల్లో ఉన్న బిడ్డతో కేసీఆర్ మాట్లాడుతున్నది కూడా రాజీవ్ గాంధీ తెచ్చిన టెక్నాలజీ తోనేని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఎప్పుడూ ప్రధాని లాగా కాకుండా.. ఎంప్లాయి గా పని చేశారని తెలిపారు. ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడు రాజీవ్ గాంధీ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

రాజీవ్ గాంధీ ఐటీ కి పునాది వేసిన తర్వాత.. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీకి పునాది వేశారు. గాంధీ కుటుంబం గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండని హితవు పలికారు. మోడీ తెచ్చింది ఏం లేదు.. యువత ఆలోచించుకోండి.. శ్రీలంక పై ఎల్టీటీ దాడులను కాపాడింది రాజీవ్ గాంధీ.. ఆ కుట్ర తోనే రాజీవ్ గాంధీని ఎల్టీటీ పొట్టన పెట్టుకున్నారని గుర్తుచేశారు. బీజేపీ నేతలకు ఇలాంటి చరిత్ర ఉందా..? అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం బలిదానాల కుటుంబం.. దేశభక్తుల కుటుంబమని ఆయన స్పష్టంచేశారు. త్యాగం.. దేశ భక్తి కలిగిన నేత రాజీవ్ గాంధీ అని.. తండ్రి ఆశయాల కోసం పని చేస్తూ.. జోడో యాత్ర చేస్తున్నాడు రాహుల్ గాంధీ అని అన్నారు.

Spread the love

Related News