కరీంనగర్‌కు బయలు దేరిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్, సెప్టెంబర్ 30: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి కరీంనగర్ కు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కరీంనగర్ కు బయలు దేరారు. సీఎం కరీంనగర్‌లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం కరీంనగర్ చేరుకుని నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)ను ప్రారంభించనున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ, నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, అనంతరం సిరిసిల్లకు సీఎం పయనం సిరిసిల్లలో రోడ్‌షో, భారీ బహిరంగ సభ, సీఎం పర్యటన నేపథ్యంలో కరీంనగర్‌లో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.

Spread the love

Related News

Latest News