ప్రతిపక్షం, ఆగస్టు 10, హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు సూచనలు చేసినా రంగనాథ్ తీరు మారడం లేదని ఆరోపించారు. కోర్టును తప్పుదోవ పట్టిస్తూ కాలయాపన చేయడం సరికాదన్నారు.
నాదర్‌గుల్‌లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ వాటిని హైడ్రా ఎందుకు పరిరక్షించడం లేదని రాంచందర్‌రావు ప్రశ్నించారు. అక్కడ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని హైడ్రా చెబుతోందని, అయితే ఆ భూములు ఎక్కడ ఉన్నాయో ప్రజల ముందు ఎందుకు ఉంచడం లేదని నిలదీశారు.
హైడ్రా కమిషనర్‌కు మజ్లిస్‌పై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని రాంచందర్‌రావు విమర్శించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో హైడ్రా పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన వరుణయాగంపై కూడా ఆయన విమర్శలు చేశారు. వర్షాకాలం ముగిసిన తర్వాత వరుణయాగం పేరుతో కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం ఉన్న విషయం ముఖ్యమంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని రాంచందర్‌రావు సూచించారు.





























