Trending Now

బ్లాక్ మెయిలర్లు, చీటర్లు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు..

మంత్రి సీతక్కకు కాంగ్రెస్ నేతలు వినతి పత్రం

ప్రతిపక్షం, నిర్మల్ ప్రతినిధి : బీఆర్ఎస్ పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లు మంత్రిగా ఉండి అధికార దాహంతో అక్రమంగా సంపాదించుకున్న అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వచ్చేందుకు ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మాజీ మంత్రి అల్లోలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ.. నిర్మల్ జిల్లా కేంద్రంలో హస్తం పార్టీ నాయకులు శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక నిర్మల్ డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీ హరి రావు నివాసం మంత్రని చేర్చుకోవద్దంటూ నినాదాలు చేశారు. అనంతరం డిసిసి అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు కు వినతిపత్రం అందజేశారు.

మాజీ మంత్రి అతని కుటుంబీకులు, అనుచరులు అక్రమంగా ఆక్రమించుకున్న చెరువులు కందకాలు డీ1 పట్టాలను కాపాడుకోడానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. గత రాజకీయ చరిత్ర అంతా ఊసరవెల్లి లాగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ జెండా పట్టుకుంటూ, 30 సంవత్సరాల రాజకీయంలో విలువలు సిద్ధాంతం లేని వ్యక్తి మాజీ మంత్రి అల్లోల అని విమర్శించారు. గత పది సంవత్సరాలుగా మంత్రిగా ఉండి కనిపించిన చెరువుని గుడిని గుడిలో ఉన్న లింగాన్ని.. భూములను, మున్సిపల్ ఉద్యోగాల్లో అవినీతికి పాల్పడి ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు. మాజీ మంత్రి కుటుంబ అధికార దాహాన్ని భరించలేకనే ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి.. ఇంట్లో కూర్చోబెడితే సిగ్గు లేకుండా అధికార పార్టీలోకి వస్తా అంటున్నవని మండిపడ్డారు. 78 సంవత్సరాలు వచ్చినా ఇంకా అధికార దాహం తీరలేదా అని ప్రశ్నించారు. ఇలాంటి నాయకున్ని పార్టీలో చేర్చుకోవద్దంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించాలని కోరారు. కబ్జామంత్రి పార్టీలోకి వస్తే కాంగ్రెస్ కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.

మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేత..

మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు.

బ్లాక్ మెయిలర్స్ చీటర్లను పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదు..

బ్లాక్ మెయిలర్స్ చీటర్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జూ అన్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ లోకి చేర్చుకోవద్దంటూ నిరసన ఆందోళన కార్యక్రమాలను పార్టీ అధిష్టానం గమనిస్తుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

Spread the love