ప్రతిపక్షం, వెబ్ డెస్క్: జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ట్విటర్ (ఎక్స్) లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. పదేళ్లుగా జనసేన కోసం ధనాన్ని వెచ్చించా.. సంపాదన, కుటుంబాన్ని వదిలి పార్టీ సిద్ధాంతాల కోసం దశాబ్ధం శ్రమించిన గుర్తింపు లేదు. అయినా తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. కనీసం తనను పిలిచి మాట్లాడలేదన్నారు. ఇప్పుడు కావాల్సింది సంయమనం.. చేయాల్సింది యుద్ధం అన్నారు. మన ప్రభుత్వం వస్తుంది.. అందరికీ న్యాయం చేస్తుందని ఆ పోస్ట్‌లో బొలిశెట్టి తెలిపారు.
ఈ పోస్ట్‌కు ‘గతం చేసిన గాయం, ఓటమి నేర్పిన పాఠం నుంచి రేపటి భవిష్యత్తుకై రాజకీయ బాటలు వేసుకుంటూ అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటూ ముందుకు సాగడమే తక్షణ కర్తవ్యం.. అని రాసి ఉన్న పవన్ కల్యాణ్ ఫోటోను జత చేశారు.