Trending Now

ఎంపీ ఎన్నికల్లో కాంగ్సెస్ కు గుణపాఠం తప్పదు..

ప్రతిపక్షం, సిద్దిపేట ప్రతినిధి, మార్చి 22: మెదక్ పార్లమెంటు నియోజకవర్గం లోని ఆరు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న మాకు.. మెదక్ పార్లమెంటు స్థానం గెలవడం నల్లేరు మీద నడకే అని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోహన్ లాల్, పాల సాయిరాం, గుండు భూపేష్, యాదగిరి, ఫక్రుద్దీన్ కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈనెల 26 నుంచి మెదక్ పార్లమెంటు స్థానంలోని అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నామని.. అందులో భాగంగా 27న సిద్దిపేట పార్టీ జిల్లా కార్యాలయం పొన్నాల వద్ద సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎంపీ అభ్యర్థి వెంకట రామిరెడ్డిలతో పాటు జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని కార్యకర్తలకు పలు సూచనలు, సలహాలు ఇస్తారని వారు తెలిపారు.

చాలా కాలంగా ఉమ్మడి మెదక్ జిల్లాతో అనుబంధం ఉన్న మాజీ కలెక్టర్ ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి ని అభ్యర్థిగా ప్రకటించడం తమ పార్టీకి కలిసి వచ్చే అంశం అన్నారు. దీనికి తోడు అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో ప్రజలు కాంగ్రెస్ పై విసిగెత్తి ఉన్నారన్నారు. తెలంగాణ ప్రజలకు కనీసం తాగునీరు, సాగునీరు అందివ్వని స్థితిలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని దుయ్యబట్టారు.

Spread the love