Maldives President Muizzu is to visit India soon: మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మయుజ్జు త్వరలోనే ఇండియాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్ష భవనం ఒక ప్రకటన విడుదల చేసింది. గతేడాది నవంబర్‌లో మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముయిజ్జు భారత్‌కు రావడం ఇది రెండోసారి. అంతకుముందు ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో మాల్దీవుల అధ్యక్షుడు భారత్‌లో పర్యటిస్తారని ప్రకటించడం గమనార్హం. అయితే ఈ పర్యటనకు సంబంధించి అధికారికంగా ప్రకటన మాత్రమే వచ్చింది. కానీ దీనికి సంబంధించిన తేదీలను వెల్లడించలేదు.