MLA Kale Yadaiah: ఎమ్మెల్యే కాలె యాదయ్యకు చేదు అనుభవం..కోడిగుడ్ల దాడి

Chevella People Warns to MLA Kale Yadaiah: చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు చేదు అనుభవం ఏర్పడింది. సొంత పార్టీ నాయకుల నుంచి నిరసన సెగ ఎదురైంది. చేవేళ్ల నియోజకవర్గ పరిధిలోని షాబాద్ మండలంలో పర్యటిస్తున్న ఆయన వాహనాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో కొంతమంది ఆయనపై టమాటలు, కోడిగుడ్లతో దాడి చేశారు.

పదేళ్ల నుంచి కష్టపడిన కాంగ్రెస్ నాయకులతోపాటు కార్యకర్తలను గుర్తించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారిని వెంట వేసుకొని తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నాయకులు ధర్నా చేసి గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు. న్యాయం చేసేంత వరకు నినాదాలు చేస్తామని హెచ్చరించారు.

Related News

Latest News