“సర్”పై అప్రమత్తంగా ఉండాలి

: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి .

ప్రతి పక్షం చండూరు జులై 04 :

ప్రత్యేక ఓటర్‌ జాబితా సవరణ (సర్‌) ప్రక్రియపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని
చండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి గారి ఆధ్వర్యం లో చామలపల్లి ,చొప్పరివారి గూడెం గ్రామాల్లో ,, SIR,, పై కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో కార్యకర్తలు ఓట్లు గల్లంతు కాకుండా అప్రమత్తంగా ఉండాలని, ఈ ప్రక్రియపై కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి సూచించారు . బూత్ లెవెల్ అధికారులు (BLOలు) ఇచ్చే ఫారాలు, ఎన్యూమరేషన్ దరఖాస్తులను కార్యకర్తలు అత్యంత జాగ్రత్తగా పరిశీలించి నింపాలి అన్నారు . చిన్న తప్పు జరిగినా ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందని బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) ప్రజల వద్దకు తిరుగుతూ, ఎలాంటి అర్హత గల ఓటు తొలగిపోకుండా కాపాడుకోవాలి అన్నారు .

సర్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షుడు కొరిమి ఓంకారం , మార్కెట్ డైరెక్టర్ బూతరాజు ఆంజనేయులు, fscs డైరెక్టర్ కట్ట భిక్షం , మండల సీనియర్ నాయకుడు ఇరిగి రాజు, మరియు చామలపళ్ళి గ్రామ శాఖ అధ్యక్షుడు రాచమల్ల మణిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుండెల ప్రతాప్, మాజి ఎంపీటీసీ నెర్లకంటి రవికుమార్ , మండల నాయకుడు కాటం రవి , యూత్ నాయకులు అలిశెట్టి కొండల్, BLA లు నెర్లకంటి దయాసాగర్ & రాచకొండ మోహన్ చారి, సీనియర్ నాయకులు పాపిరెడ్డి , నరేష్ లు పాల్గొన్నారు

Spread the love

Related News

Latest News