Trending Now

కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: దేశంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో మొదటి వరుసలో నిలిచే ఐఐటి మద్రాస్ కేటీఆర్ ను తమ విద్య సంస్థలో జరుగబోయే సమ్మిట్ అనే ప్రముఖ కార్యక్రమంలో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానించింది. ప్రతి ఏటా ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించే అంట్రపెన్యురల్ ఫెస్టివల్ (E-Summit) ఈ- సమ్మిట్ లో కీలకోపన్యాసం చేయాలని కోరింది. ఐఐటి మద్రాస్ లో ప్రతి ఏటా నిర్వహించే ఈ- సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి అంట్రపెన్యురల్ రంగంలో కీలకమైన వ్యక్తులను, సంస్థల అధిపతులను, పాలసీ మేకర్లను, ప్రముఖ వ్యక్తులను ఆహ్వానిస్తుంది. కేటీఆర్ కున్న అపారమైన అనుభవాన్ని పురస్కరించుకొని, భవిష్యత్తు అంట్రపెన్యురల్ ఔత్సాహికులకు దిశా నిర్దేశం చేయాల్సిందిగా కేటీఆర్ కు పంపిన ఆహ్వానంలో ఐఐటి మద్రాస్ కోరింది.

Spread the love

Related News