Trending Now

వికసిత్ భారత్ లక్ష్యాన్ని బలపరిచేందుకు ప్రణాళిక..

అదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్

నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 18 : గుడిహత్నూర్ మండల కేంద్రంలో జరిగిన బీజేపీ పార్టీలో చేరికల కార్యక్రమంలో అదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకు చెందిన మాజీ కౌన్సిలర్ శైలేందర్ వాగ్మారేతో పాటు, లింగాపూర్, మాన్కాపూర్, శంభుగూడ, గుడిహత్నూర్ తో పాటు తదితర గ్రామాలకు చెందిన వారు బీజేపీ కండువ కప్పుకుని చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పార్లమెంట్ ఇంచార్జ్, అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయని బీఆర్ఎస్ మునిగిన నావ అయితే కాంగ్రెస్ మునగబోతున్న నావ అని.. ఇక తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు అంత బీజేపీ పార్టీదేనని, రోజు రోజుకు బీజేపీ పార్టీలో చేరికలు పెరగడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.

అదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ మాట్లాడుతూ.. గుడిహత్నూర్ మండలంలో తాను గతంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి పనులను గుర్తు చేశారు. గుడిహత్నూర్ లో ప్రస్తుతం జరుగుతున్న అండర్ పాస్ పనులు తాను ఎంపీగా ఉన్నప్పుడు మంజూరైన పనులని గుర్తుచేశారు. అంతే కాకుండా మండలంలో ప్రతి గ్రామంలో విద్య, వైద్యంతో పాటు మౌలిక వసతుల కల్పన తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నప్పుడే జరిగాయని అన్నారు. గతంలో గ్రామాలలో జరిగిన అభివృద్ధి పనులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సంక్షేమ పథకం కేంద్ర ప్రభుత్వ నిధులతో ముడిపడి ఉన్నవేనని తెలిపారు. ఏదైన సమస్య వస్తే ఓ కుటుంబ పెద్ద తన కుటుంబ సభ్యులను ఎలా కాపాడుకుంటాడో అలాగే దేశ ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించి కరోనా విపత్తు సమయంలో కంటికి రెప్పలా కాపాడుకున్నా మహనీయుడు నరేంద్రమోదీ గారని తెలిపారు. అంతటి మహోన్నతమైన వ్యక్తిని మరోసారి ప్రధాని చేయడమే లక్ష్యంగా కమలం పువ్వు గుర్తుకు ఓటువేసి కృతజ్ఞత భావాన్ని తెలియపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పతాంగే బ్రహ్మానంద్, పార్లమెంట్ కో కన్వీనర్ మయూర్ చంద్ర, బీజేపీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, బీజేపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News