విద్యార్థులకు ఆగస్టు 15లోగా ఏకరూప దుస్తులు అందజేయాలి

  • విద్యార్థి కొలతలు తీసుకొని విద్యార్థులకు నాణ్యమైన దుస్తులు కుట్టి ఇవ్వాలి
  • నీటి లభ్యతకు అనుగుణంగా రైతులు పంట మార్పిడిని ప్రోత్సహించాలి: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ప్రతిపక్షం, జూలై 24. వనపర్తి ప్రతినిధి: ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ, గురుకులాలు, మోడల్ స్కూళ్ళలో చదువుకుంటున్న విద్యార్థులకు ఆగస్టు 15 లోగా కొత్త ఏకరూప దుస్తులు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పి.డి. డీఆర్డిఒ ను ఆదేశించారు.శుక్రవారం విద్యార్థుల ఏకరూప దుస్తుల అందజేత పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి వివరిస్తూ ఈసారి విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా లెట్ బ్లూ షర్ట్, డార్క్ బ్లూ ప్యాంట్ తో కూడిన ఒక్కొక్కరికి రెండు జతల ఏకరూప దుస్తులు అందజేయడం జరుగుతుందని, అందుకు అనుగుణంగా టిజికో/మఫత్ లాల్ ద్వారా మండలాలకు బట్ట అందజేయడం జరుగుతుందని తెలిపారు. నాణ్యమైన దుస్తులు కుట్టడానికి ఇప్పటికే మాస్టర్ టైలర్ ల ద్వారా గుడ్డ కత్తిరించడం, కుట్టడం పై స్వయం సహాయక సంఘాల టైలర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, సకాలంలో నాణ్యమైన దుస్తులు కుట్టించి ప్రతి విద్యార్థికి అందజేసే విధంగా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ జిల్లాలోని 512 పాఠశాలల్లో 38653 విద్యార్థులు, 15 కేజీబీవీల్లో 4531 మంది విద్యార్థులు, 3 మోడల్ స్కూళ్లకు 1919 విద్యార్థులు, గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు ఇవ్వడానికి ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో శిక్షణ పొందిన 358 స్వయం సహాయక సంఘాల టైలర్లను గుర్తించడం జరిగిందని, మండలాలకు ఇప్పటి వరకు వచ్చిన గుడ్డను ఎప్పటికప్పుడు విభజించి దుస్తులు కుట్టేందుకు టైలర్లకు అందజేయడం జరుగుతుందని తెలిపారు.

విద్యార్థులకు ఆగస్ట్ 15 లోగా ప్రతి విద్యార్థికి ఒక జత ఏకరూప దుస్తులు, ఆగస్టు 25 లోగా రెండవ జత అందజేసే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీఆర్డిఒ ను ఆదేశించారు.వ్యవసాయ శాఖ సమీక్షను పురస్కరించుకొని కలెక్టర్ జిల్లాలో ఇప్పటి వరకు కురిసిన వర్షాలు, సమస్యాత్మక గ్రామాలు, ఇప్పటి వరకు జరిగిన సాగు విస్తీర్ణం పై వ్యవసాయ అధికారికి దిశా నిర్దేశం చేశారు. ఈసారి ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు పండించాల్సిన పంటల పై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పంట వారిగా సరైన ప్రణాళిక వేసుకోవాలని అందుకు తగ్గట్టు విత్తనాలు, ఎరువులు అందజేయాలని సూచించారు. కందులు, నువ్వులు, వేరుసెనగ వంటి పంటలు వేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో కూరగాయల సాగు సైతం పెంచే విధంగా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ, ఉద్యానవన అధికారులను ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ నుండి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గ్రామీణాభివృద్ధి శాఖ దానకిషోర్, విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దివ్య దేవరాజ్, వనపర్తి జిల్లా నుండి అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ ఖీమ్య నాయక్, ఇంచార్జి జిల్లా విద్యా శాఖ అధికారి యాదయ్య, పి.డి. డీఆర్డిఒ ఉమాదేవి, వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు, ఉద్యానవన అధికారి విజయభాస్కర్, సంక్షేమ శాఖల అధికారులు తదితరులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News