ప్రతిపక్షం, జూన్ 24: జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన మహిళా సాధికారత కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రసంగించారు. మహిళలు ఎంత ప్రతిభ, కృషి చూపినా సమాజంలో ఎక్కడో ఒకచోట అడ్డంకులు ఎదురవుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
మహిళల అభివృద్ధికి ప్రభుత్వం, కుటుంబం, సమాజం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగాలు, పదోన్నతులు, నాయకత్వ అవకాశాల్లో మహిళలకు సమాన అవకాశాలు లభించేలా వ్యవస్థలో మార్పులు రావాలని అభిప్రాయపడ్డారు.
సమాజంలో ఇప్పటికీ బాల్య వివాహాలు, లింగ వివక్ష వంటి సమస్యలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో తమ లక్ష్యాల కోసం కష్టపడాలని, సోషల్ మీడియా ప్రభావానికి లోనుకాకుండా స్వీయ నమ్మకంతో ముందుకు సాగాలని సూచించారు.
మహిళల సాధికారత కోసం పనిచేస్తున్న సంస్థల కృషి అభినందనీయమని పేర్కొంటూ, సమానత్వం సాధించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.





















