ప్రతిపక్షం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మాట తప్పుతోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ లో అమీర్ పేటలోని మైత్రివనం వద్ద కార్యకర్తలతో ధర్నాలో పాల్తొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక ఫీజులు వసూలు చేయడం ఏంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. ఉచిత ఎల్ఆర్ఎస్ అమలు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు.