Trending Now

బీఆర్ఎస్ కీలక నిర్ణయం..

ప్రతిపక్షం, తెలంగాణ: మార్చి 1న చలో మేడిగడ్డకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. మొత్తం 150 మంది పార్టీ ముఖ్య నేతలతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సందర్శించి.. ప్రాజెక్ట్‌ గొప్పతనం వివరిస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ వెల్లడించారు. తెలంగాణ భవన్ నుంచి బస్సుల్లో కాళేశ్వరం వెళ్లి, దశల వారీగా అన్ని చోట్లకు వెళ్తామన్నారు. 150 నుంచి 200 మంది బీఆర్ఎస్ ప్రతినిధులతో కలిసి తెలంగాణ భవన్ నుంచి బయలుదేరనున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

చలో మేడిగడ్డ కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు కాళేశ్వరం సందర్శించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని ప్రజలకు తెలియజేసే కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తద్వారా చాలా మంది ఆరోపణలకు చెక్ పెడుతామన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని, అందుకోసమే మేడిగడ్డకు వెళ్తున్నట్లు వెల్లడించారు. కాళేశ్వరం గొప్పతనం ఏంటో విడుతల వారిగా చూపిస్తామన్నారు.

Spread the love