Trending Now

కాంగ్రెస్‌లోకి ‘అల్లోల’ వద్దే వద్దు.. నేతలు ఆందోళనలు

ప్రతిపక్షం, నిర్మల్: కాంగ్రెస్ లోకి “అల్లోల ‘వద్దే వద్దు.. కాంగ్రెస్ నేతు ఆందోళన బాటపట్టారు. తమ పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అనేక అవినీతి అక్రమాలు, భూకబ్జాలు, ప్రతిపక్షాలపై దాడులు, కేసులు చేసి ఇటీవల బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి పై పోటీ చేయగా.. ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ని కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దంటూ.. నిర్మల్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన బాట పట్టాయి. ముఖ్యంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆయా విభాగాల పదాధికారులు, ప్రజా ప్రతినిధులు సాక్షాత్తు ప్రెస్ మీట్ లు పెట్టి.. నిరసన శిబిరాలు ఏర్పాటు చేసి అందులో చేరికను నిరసిస్తూ.. ఆయన చేసిన అవినీతి అక్రమాలు భూకబ్జాలను వెళ్ళగకుతూ నినాదాలు చేస్తున్నారు.

ఈ విషయంలో డిసిసి అధ్యక్షులు కే శ్రీహరి రావు తో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు కూడా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్నట్లు నియోజకవర్గ వ్యాప్తంగా గుసగుసలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని ఏడు మండలాలతో పాటు నిర్మల్ పట్టణంలో కూడా కాంగ్రెస్ ఆయ విభాగాల పదాధికారులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు రోజువారీగా తమ నిరసన గలాని వినిపిస్తూ.. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ని చేర్చుకుంటే నిర్మల్ నియోజకవర్గం తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ భవిష్యత్తు దారుణ స్థితికి చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News