Trending Now

సిద్దిపేట నుండి పోస్ట్ కార్డు ఉద్యమం..

ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 15: సిద్దిపేట నుండి మరో ఉద్యమానికి వినూత్న కార్యక్రమానికి రైతులు శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. సిద్దిపేట నియోజకవర్గం లో సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్ లో సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ లో, చిన్న కోడూర్ మండలం మార్కెట్ యార్డ్ లో రైతులు స్వచ్చందంగా సీఎం రేవంత్ రెడ్డి కి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు వ్రాసారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రైతు హామీలు అమలు చేయక పోవడం తో రైతులు ఆవేదన చెందారు. పోస్ట్ కార్డు ద్వారా తమ ఆవేదన ను సీఎం రేవంత్ కి పంపారు. రైతులకు ఇచ్చిన హామీలు వరి ధాన్యానికి ఇస్తానన్న బోనస్ రూ. 500, రైతు భరోసా రూ. 10,000 లకి బదులు రూ. 15,000 రూపాయలు, రైతు కూలీలకు ఇస్తానన్న రూ. 12,000, రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు, రైతు బీమా, వర్షాలు రాక ఎండిపోయిన పంటలకు నష్టపరిహారంగా రూ. 2,5000 వెంటనే అమలు చేసి రైతు సోదరులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులు రాసి పంపారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఎంపీ ఎన్నికల్లో ఓటు తో గుణపాఠం చెపుతామని రైతులు హెచ్చరించారు.

Spread the love

Related News

Latest News