Chiranjeevi and Mahesh Babu praise for ‘Mattu Vadalara-2’: శ్రీసింహా నటించిన క్రైమ్ కామెడీ మూవీ ‘మత్తు వదలరా 2’పై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. ‘నిన్ననే ‘మత్తు వదలరా 2 చూశాను. ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరి దాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. ఎండ్ టైటిల్స్ కూడా వదలకుండా చూశా. ఈ క్రెడిట్ అంతా చిత్ర దర్శకుడు రితేష్ రాణాకు చెందుతుంది.’ అని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఇక, ఈ చిత్రాన్ని ఉద్దేశించి మహేశ్‌బాబు సైతం తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ‘మత్తు వదలరా 2’ మంచి వినోదాన్ని అందించింది. ఆద్యంతం నేను ఎంజాయ్ చేశా. సింహా కోడూరితోపాటు నటీనటులందరి ప్రదర్శన చాలా బాగుంది.’ అని అన్నారు.