ఆటో ఎక్కిన ‘‘బండి’’

  • మోదీ పుష్కర పాలన ఎట్లుంది?
  • మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలపై ఆటో డ్రైవర్ కు పుస్తకాలను అందించిన కేంద్ర మంత్రి

ప్రతిపక్షం, జూన్ 12, బ్యూరో ఉమ్మడి కరీంనగర్: నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలనా విజయాలపై వివరిస్తూ వివిధ వర్గాలను కలుస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు ఆటో డ్రైవర్ ను కలిశారు. ఆటోలో ఎక్కి కాసేపు ప్రయాణించారు. ‘‘స్వచ్ఛ పాఠశాల’’ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం హుస్నాబాద్ నియోజకవర్గం రేకొండ గ్రామానికి విచ్చేసిన బండి సంజయ్ తిరుగు ప్రయాణంలో రేకొండ ఆటో స్టాండ్ వద్ద ఆగారు. కరీంనగర్ వైపు వెళుతున్న ఆటోలో ఎక్కారు. దిలీప్ అనే ఆటో డ్రైవర్ ను పలకరిస్తూ… మోదీ 12 ఏళ్ల పాలన ఎట్లుందంటూ ఆరా తీశారు. ‘‘మోదీ గారు అనేక పథకాలను అమలు చేశారు. ఉచిత బియ్యం మోదీ ఇస్తున్నారు. ఉజ్వల గ్యాస్ ఇస్తున్నారు. గ్రామాలకు రోడ్లన్నీ మోదీ ప్రభుత్వం వేసినవే. జాతీయ రహదారుల పైసలన్నీ కేంద్రానివే. కరీంనగర్ జగిత్యాలకు నిధులు మంజూరు చేశారు. 12 లక్షల ఉద్యోగాలిచ్చారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున పైసలిస్తున్నారు. ఆ నిధులతోనే గ్రామాలు, పట్టణాల అభివ్రుద్ధి చెందుతున్నాయి’’ అని వివరించారు. ‘‘దేశంలో 4 వేల రోజులకుపైగా పాలన కొనసాగిస్తున్న ఏకైక ప్రధాని మోదీ. ఆయన నిరంతరం పేదల కోసమే పనిచేస్తున్నారు. పేదల పాలిట దేవుడు నరేంద్రమోదీ. ఆటో డ్రైవర్ గా నువ్వు రోజు కనీసం వంద మందినైనా కలుస్తుంటావ్. రాజకీయాలకు అతీతంగా మోదీ ఈ దేశానికి చేస్తున్న మంచి పనులను చెప్పాలి. మోదీగారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ దేశానికి మరింత సేవ చేయాలని కోరుకుందాం’’అని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనపైనా బండి సంజయ్ ఆరా తీశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపట్ల అసంత్రుప్తితో ఉన్నారంటూ ఆటో డ్రైవర్ బదులిచ్చారు. ఏ వర్గాలు ఎక్కువగా కోపంగా ఉన్నాయని అడిగితే ‘‘మా ఆటో ఎక్కే వాళ్లలో మహిళలు, వ్రుద్దులు కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారు’’అని పేర్కొనడం గమనార్హం. మోదీ పాలనను ప్రస్తావించగా ‘యువకులు, మహిళలంతా మోదీ పాలన బాగుందంటున్నారు. నేను కూడా మోదీ అభిమానినే’’అని బదులివ్వడం విశేషం.

Spread the love

Related News

Latest News