హైదరాబాద్‌లో కేటీఆర్’కు వ్యతిరేక ఫ్లెక్సీలు.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు

ప్రతిపక్షం, జూలై 24, హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయనను లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన వివాదాస్పద ఫ్లెక్సీలు రాజకీయ చర్చకు దారితీశాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీల్లో కేటీఆర్‌పై విమర్శలు చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.

కొన్ని ఫ్లెక్సీల్లో “కరప్షన్ కింగ్ KTRకి హ్యాపీ బర్త్‌డే” అంటూ పేర్కొనడంతో పాటు, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న పేపర్ లీకేజీలను ప్రస్తావిస్తూ ప్రశ్నలు సంధించారు. ఈ ఫ్లెక్సీలు వెలుగులోకి రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలాలకు చేరుకుని ఫ్లెక్సీలను తొలగించారు. వాటిని ఎవరు ఏర్పాటు చేశారు? దాని వెనుక ఎవరైనా వ్యక్తులు లేదా సంస్థల ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

నగరంలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Spread the love

Related News

Latest News