బీఆర్ఎస్ కార్యాలయంలో దసరా సందడి
ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్ అక్టోబర్ 22: విజయదశమి పండుగను పురస్కరించుకుని మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అలాయి బలై కార్యక్రమాన్ని నిర్వహించారు గురువారం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సందడి నెలకుంది. మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డిని జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు కార్యాలయానికి చేరుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పద్మా దేవేందర్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణుల కోసం పద్మా దేవేందర్‌రెడ్డి భోజన ఏర్పాట్లు చేశారు. నాయకులు, కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ పండుగ సంతోషాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కిరెడ్డి కృష్ణారెడ్డి సీనియర్ నాయకులు మున్సిపాల్ మాజీ చైర్మన్ బట్టి జగపతి. స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు దీపక్ కుమార్ జుబేర్ బట్టి ఉదయ్ నాయకులు లింగారెడ్డి గడ్డమీది కృష్ణ గౌడ్ జీవన్‌రావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంకీ నాయకులు, కార్యకర్తల రాకపోకలతో సందడిగా మారింది.


































