సీఎం రేవంత్ రెడ్డి పాలనపై కాంగ్రెస్ నాయకుల ప్రశంసలు
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి!
నంగునూరులో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేసి, బాణసంచా కాల్చి సంబురాలు..
ప్రతిపక్షం,నంగునూరు, నవంబరు 9: ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ తెలంగాణ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని టీపీసీసీ కార్యదర్శి, నంగునూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అచ్చిన సత్తయ్య, సిద్ధన్నపేట, నాగరాజు పల్లి సర్పంచులు సంగు పురేందర్, ముక్కెర లింగంకొనియాడారు.నంగునూరు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవులపల్లి యాదగిరి, అచ్చిన సత్తయ్య, సంగు పురేందర్, ముక్కెర లింగం యాదవ్ కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. బాణసంచా కాల్చి ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
ఈ సందర్భంగా దేవులపల్లి యాదగిరి, అచ్చిన సత్తయ్య, సంగు పురేందర్, ముక్కెర లింగం యాదవ్ మాట్లాడుతూ.. గత పాలనలో అప్పులు, అవినీతితో ఆర్థికంగా దెబ్బతిన్న తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థవంతంగా కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సిద్దన్నపేట సర్పంచ్ సంగు పురేందర్, నాగరాజుపల్లి సర్పంచ్ ముక్కెర లింగం యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అచ్చిన సత్తయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గంగుల రవి, అనరాజు నాగరాజు, చెలికాని యాదగిరి, బాగు శ్రీకాంత్ యాదవ్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గార్లపాటి విక్రమ్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు ఆడెపు లావణ్య, గౌరబోయిన సంపత్, ఖానాపూర్ ఉపసర్పంచ్ గణపూర్ రమేశ్, గాండ్ల రమేశ్, బస్వరాజు రాములు, తుపాకుల శ్రీనివాస్, దాసరి కిషన్, మహేందర్ రెడ్డి, ఆరెపల్లి సురేశ్, బోడిగే శ్రీనివాస్ గౌడ్, ప్రసాద్, నవీన్, లక్ష్మణ్, దేవేందర్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.





























