[t4b-ticker]

మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి మాతృమూర్తి దశదిన కర్మకు సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 26: మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి మాతృమూర్తి శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం.. శేషమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కాసు కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు. శేషమ్మ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి, రాజేష్ రెడ్డి, నాగరాజుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన వారు శేషమ్మ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలిపారు.

Spread the love

Related News

Latest News