[t4b-ticker]

అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి

ప్రతిపక్షం, ఆగస్టు 26: అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నిజామాబాద్‌ శివారు గూపన్‌పల్లికి చెందిన రాహుల్ ఉన్నట్లు సమాచారం. ఉన్నత విద్య కోసం మూడు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన రాహుల్‌ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఫ్లోరిడాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం ఏ విధంగా జరిగిందనే విషయంపై స్థానిక అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

రాహుల్‌ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కొద్దికాలానికే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడం కుటుంబ సభ్యులు, బంధువులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరో ఇద్దరు మృతుల వివరాలు, వారి స్వస్థలాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతదేహాల తరలింపు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించే ప్రక్రియపై అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Spread the love

Related News

Latest News