చండూరు మున్సిపాలిటీ లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

*సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన ధీర వనిత ఐలమ్మ – చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు

ప్రతిపక్షం, చండూరు సెప్టెంబర్ 26 : వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని చండూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముందుగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రాంతంలో సామాజిక అన్యాయం, దోపిడీ మరియు అణచివేతకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పోరాటం చేసిన వీరనారిగా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ఆమె జీవితం, ఆమె చేసిన త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ చేసిన సామాజిక పోరాటం, ధైర్యసాహసాలు, ఆత్మగౌరవం మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ ఎల్. మల్లేశం, కౌన్సిల్ సభ్యులు శ్రీమతి తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్, శ్రీమతి జెల్ల ధనమ్మ శ్రీనివాస్, శ్రీ కొన్రెడ్డి మధు, శ్రీమతి కోడి సుష్మ వెంకన్న, శ్రీ కటకం రమేష్, కో-ఆప్షన్ సభ్యులు షేక్ ఖలీల్, శ్రీమతి షేక్ సలీమా షరీఫ్, మేనేజర్ జి. రాములు, సీనియర్ అసిస్టెంట్ ఏ. సాయిభారద్వాజ్, జూనియర్ అసిస్టెంట్ ఎ. జగన్, సీనియర్ అకౌంటెంట్ పి. శృతి, వార్డ్ ఆఫీసర్లు జి. శ్రీరాములు, బి. సాయిరాం, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎం. అరవింద్ రెడ్డి, బిల్ కలెక్టర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Spread the love

Related News

Latest News