థైరాయిడ్ ఉంటే బుజం నొప్పి వస్తుందా..?

ప్రతిపక్షం, సెప్టెంబర్ 25: హైపోథైరాయిడిజం(Hypothyroidism) ఉన్నవారిలో షోల్డర్ (భుజం) నొప్పి వచ్చే అవకాశం ఉందా?అవును, థైరాయిడ్ సమస్యలు ముఖ్యంగా హైపోథైరాయిడిజం (Hypothyroidism) ఉన్నవారిలో షోల్డర్ (భుజం) నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది తరచుగా ఫ్రోజన్ షోల్డర్ (Frozen Shoulder) లేదా అడెసివ్ క్యాప్సూలిటిస్ (Adhesive Capsulitis) రూపంలో కనిపిస్తుంది…

మన మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి, మన శరీర ఉష్ణోగ్రత, గుండె కొట్టుకునే వేగం, మెదడు అభివృద్ధిని నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది…

ఈ రోజులో చాలా మందికి మధుమేహ వ్యాది ఉన్నట్లుగా థైరాయిడ్ పేషెంట్లు కూడా పెరిగిపోతున్నారు.
మోడ్రన్‌ లైఫ్‌స్టైల్‌, అనారోగ్యకర ఆహార అలవాట్ల వల్ల థైరాయిడ్ (Thyroid) సమస్యలు ఈ మధ్య మామూలు అయిపోయాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి చేజారి పోతుంది.

అయితే చాలా మందికి థైరాయిడ్ వల్ల వచ్చే నొప్పి గురించి మాత్రం తెలియదు. ఈ సమస్య వల్ల మన శరీరంలో కొన్ని భాగాల్లో బాగా నొప్పి వస్తుంది.

ప్రస్తుత కాలంలో చాలా మందికి ఈ సమస్య వస్తుంది. నిజం చెప్పాలంటే చాలా మందికి ఈ థైరాయిడ్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియదు.కేవలం దీనివల్ల బరువు పెరుగుతామని మాత్రమే తెలుసు. కానీ ఈ సమస్య వస్తే శరీరంలో కొన్ని భాగాల్లో నొప్పి కలుగుతుంది. దీన్ని బట్టి కూడా మీకు థైరాయిడ్ ఉందని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఉన్నవారికి థైరాయిడ్ ఇంకా ఎక్కువైందని తెలుసుకోవచ్చు.కొంత మందికి కొన్ని సందర్భాల్లో నొప్పి శరీరంలోని అసాధారణ భాగాలలో కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు వీపు, భుజాలు లేదా ఛాతీలో నొప్పి వస్తుంది. ఛాతీ నొప్పి అనేది తీవ్రమైన లక్షణం. వైద్యుడిని సంప్రదించడం అవసరం అయినప్పటికీ.. థైరాయిడ్ ఇతర లక్షణాలు కూడా ఉంటే ఇది గ్రంథితో సంబంధం ఉన్న సంకేతం కావచ్చు.

కారణాలు:

  • కనెక్టివ్ టిష్యూ మార్పులు: థైరాయిడ్ హార్మోన్లు తగ్గడం వల్ల కీళ్ల చుట్టూ ఉండే కణజాలం (Connective tissues) మరియు కొల్లాజెన్ ఉత్పత్తి ప్రభావితమై, కీళ్లు బిగుసుకుపోతాయి.
  • వాపు (Inflammation): ఆటోఇమ్యూన్ థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో శరీరంలో వాపు ప్రక్రియ పెరిగి, భుజం కీళ్లపై ప్రభావం చూపుతుంది.
  • జీవక్రియ మందగించడం: మెటబాలిజం నెమ్మదించడం వల్ల కండరాలు, కీళ్ల పనితీరు తగ్గి నొప్పి మరియు దృఢత్వం (Stiffness) కలుగుతాయి..
  • థైరాయిడ్ శరీర జీవక్రియ, హార్మోన్లు, అనేక ముఖ్యమైన విధులను నియంత్రిస్తుంది. ఈ గ్రంథి అవసరమైన దానికంటే ఎక్కువ లేదా తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించినప్పుడు.. శరీరంలోని వివిధ భాగాలలో నొప్పి, బలహీనత, వాపు వంటి సమస్యలు ప్రారంభమవుతాయి.

జాగ్రత్తలు:

థైరాయిడ్ సంబంధిత నొప్పిని తగ్గించడానికి కేవలం మందులే కాకుండా సరైన జీవనశైలి, ఫిజికల్ థెరపీ, నొప్పి నిర్వహణ అవసరం. సకాలంలో చికిత్స చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభించడమే కాకుండా.. జీవిత నాణ్యత పెరుగుతుంది.

ముఖ్యంగా శరీరంలో వచ్చే నొప్పి థైరాయిడ్‌తో ముడిపడి ఉందనిపిస్తే మీ లక్షణాలను చెక్ చేసుకోండి. నొప్పి ఎప్పుడు, ఎక్కడ వస్తుంది, ఏ పరిస్థితులలో పెరుగుతుంది లేదా తగ్గుతుంది. వీటన్నింటినీ గమనించాలి. దీనితో పాటు బరువు, మానసిక స్థితి, ఆకలి, మెడ వాపు వంటి లక్షణాలను కూడా గమనించాలి. TSH, T3, T4 రక్త పరీక్షల ద్వారా థైరాయిడ్ స్థితిని గుర్తించవచ్చు.

Spread the love

Related News