ఇందిరమ్మ ఇళ్లతోనే పేదల సొంతింటి కల సాకారం: మేకల సాగర్ రెడ్డి

*కస్తాలలో ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం-రిబ్బన్ కట్ చేసిన కాంగ్రెస్ నేతలు.

*ఇందిరమ్మ ఇల్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక-చండూరు మండల అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి

ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 31: చండూరు మండలం కస్తాల గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా ప్రారంభించారు. పేద ప్రజలకు సొంత ఇంటి నిర్మాణం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారానే సాధ్యమవుతుందని చండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నూతన గృహప్రవేశం చేసిన ఐతరాజు సుగుణమ్మ – శంకర్ దంపతులను అభినందించి, వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖా అధ్యక్షుడు కలిమికొండ మల్లేష్ శుభాకాంక్షలు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖా అధ్యక్షుడు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాస సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.మేకల సాగర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.

ఇందిరమ్మ ఇల్లు అనేది కేవలం నాలుగు గోడల సముదాయం మాత్రమే కాదని, ప్రతి కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవం, భవిష్యత్తుకు భరోసా కల్పించే శాశ్వత ఆస్తి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు మండల అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి, కస్తాల గ్రామ శాఖ అధ్యక్షుడు కల్మికొండ మల్లేష్, ఎఫ్ ఎస్ సి ఎస్ సి బ్యాంకు డాక్టర్ కట్ట బిక్షం, చండూరు మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గంటకంపు అశోక్, పంగ రామకృష్ణ, మెరుగు అంజయ్య, బండి శేఖర్, గురజాల స్వామి, బొమ్మరబోయిన కృష్ణయ్య , ఆకారపు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News