పార్లమెంటులో నేడు రెండు కీలక బిల్లులు!

ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ, జూలై 27: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్‌సభలో రెండు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్ట నుంది. చట్ట సవరణ బిల్లు-2026 తో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్య బిల్లు, అదేవిధంగా ప్రశ్న పత్రాల లీకేజీకి పాల్పడితే కఠిన శిక్ష విధించాలని ప్రతిపాదిస్తూ ప్రభు త్వం సోమవారం లోకసభలో చట్ట సవరణ బిల్లు తీసుకురానుంది.అయితే గత ఐదు రోజులుగా ఉభయ సభలు వరుసగా వాయిదా పడిన నేపథ్యంలో.. నేటి సమావేశాలు కూడా ప్రతిపక్షాల ఆందోళన లతో వాడివేడిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఆగస్టు 13 వరకు మొత్తం 19 రోజుల పాటు జరగనున్న వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి శాసన కార్యక్రమాలు సజావుగా సాగలేదు. మరోవైపు ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జు కార్యాలయంలో ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశమై తమ వ్యూహాన్ని ఖరారు చేయనున్నా రు. విద్యార్థులపై పోలీసుల దాడులకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పేలా పార్లమెంటు వేదికగా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచాలని భావిస్తున్నాయి, ఈ ఘటనపై చర్చకు అనుమతివ్వాలని తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురా లు సాగరికా ఘోష్ నోటీసు ఇచ్చారు. అలాగే ఈ ఘటనకు బాధ్యత వహించా లని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాస్తూ, బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Spread the love

Related News

Latest News