బీఆర్ఎస్ శ్రేణులు ఎంతో అప్రమత్తంగా ఉండాలి.
ప్రతిపక్షం, వికారాబాద్, ఆగస్టు 04: తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా 71% డిజిటలైజేషన్ పూర్తయిందని, మిగిలిన ఆరు రోజులు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తాండూరు బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణ కేంద్రంలోని బి ఆర్ ఎస్ క్యాంపు కార్యాలయంలో ఎస్ ఐ ఆర్ ఫై నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బి ఎల్ ఏ లతో సమీక్ష సమావేశాన్ని వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటు హక్కు కలవారు తాండూరు లోనే ఓటు పొందాలన్నారు. ఎన్యుమరేషన్ ఫారంలను వెంటనే సంబంధిత అధికారులకు తాండూరు నియోజకవర్గ ప్రజలు అందించాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, కేసీఆర్ ఆలోచన మేరకు పనిచేయాలని బి ఎల్ ఏ లకు సూచించారు. మాజీ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఎల్లప్పుడు ప్రజల పక్షాన నిలుస్తుందన్నారు.


















