ప్రతిపక్షం, జూలై 29: ఢిల్లీ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడటం వెంటనే నిలిపివేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులపై పోలీసుల చర్యలు ఇదే విధంగా కొనసాగితే మళ్లీ భారీ స్థాయిలో శాంతియుత ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
ఇటీవల జరిగిన నిరసనల అనంతరం ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులను గుర్తించి విచారణలు, అరెస్టుల పేరుతో వేధిస్తున్నారంటూ అభిజీత్ ఆరోపించారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని, శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని లక్ష్యంగా చేసుకోవద్దని ఆయన కోరారు.
మరోవైపు నిరసనల సందర్భంగా పోలీసులపై దాడులు చేయడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో CJP నాయకత్వం విద్యార్థులపై చర్యలు నిలిపివేయాలని మరోసారి ప్రభుత్వాన్ని కోరింది.

















