టిప్పర్ ఢీకొని యాక్టివాపై వెళ్తున్న యువతీ, యువకుడు దుర్మరణం
ప్రతిపక్షం, జవహర్నగర్, సెప్టెంబర్ 20: మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వంపుగూడ–ఎల్లారెడ్డిగూడెం వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాక్టివాపై వెళ్తున్న దీప్సిక (19), అమర్దొయ (15) ను టిప్పర్ లారీ ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.వినాయక మండపంలో అన్నదానం కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న జవహర్నగర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.






























