కాలేశ్వరం కాదు , అది కూలేశ్వరం.
40 కోట్ల నిధులు తెల్ల కాగితాలకే పరిమితం
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లపై మేకల సాగర్ రెడ్డి విమర్శలు.
ప్రాజెక్టులు కట్టింది కేసీఆరా? రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది మీరు కాదా?
చండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేకల సాగర్ రెడ్డి
ప్రతిపక్షం చండూరు సెప్టెంబర్ 05 : 1000 రోజుల ప్రజాపాలనపై బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం రోజున చండూరు మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో నిర్వహించిన వంటవార్పు నిరసన కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలపై చండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.కేసీఆర్ ప్రాజెక్టులు కట్టి నీళ్లను తెచ్చి చెరువులు నింపారని చెప్పడానికి సిగ్గు అనిపించడం లేదా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు అని చండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి ప్రశ్నించారు.
మీరు కట్టిన ప్రాజెక్టులు ఎన్ని? ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు అందించారు? 30 వేల పంట పండించడానికి 25 వేల కరెంటు బిల్లు కట్టాల్సి వచ్చేలా చేసిన మహా అద్భుతం కాలేశ్వరం అని ఎద్దేవా చేశారు.కాలేశ్వరం కట్టిన మహర్షి కేసీఆర్ అయితే, ఆయన పరమానంద శిష్యులు మీరు. చివరకు అది కూలేశ్వరం అయింది. ఒక్క ఎకరాకు కూడా నీళ్లు అందించలేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారిన కాలేశ్వరాన్ని పట్టుకొని ఒకటే గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.మున్సిపాలిటీకి నువ్వు తెచ్చిన నిధులు ఉట్టి నీటి మూటలే. మున్సిపాలిటీకి 40 కోట్ల నిధులు తెల్ల కాగితాలపై తప్ప ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని, ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని హితవు పలికారు.





























