[t4b-ticker]

ఓటరు జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ మను చౌదరి

ప్రతిపక్షం, సెప్టెంబర్ 05, శామీర్ పేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–2026లో భాగంగా నోటీసులు జారీ చేసిన ఓటర్ల నుంచి స్వీకరిస్తున్న ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు.శనివారం అంతాయిపల్లి, ఉప్పరపల్లి గ్రామాల్లోని పోలింగ్‌ స్టేషన్లను జిల్లా కలెక్టర్ సందర్శించి ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ–2026లో హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. మ్యాపింగ్‌ జరగని ఓటర్లు, ఓటరు కార్డులో వ్యత్యాసాలు (అనామలీస్) ఉన్న కేటగిరీలకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఓటర్లు సమర్పిస్తున్న ధ్రువపత్రాలను త్వరితగతిన పరిశీలించాలని ఆదేశించారు.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన అనంతరం సంబంధిత పత్రాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని సూచించారు.ఓటరు జాబితాలోని వివరాలను సంబంధిత ఓటర్లు సమర్పించేలా రాజకీయ పార్టీలు తమ బూత్ స్థాయి ఏజెంట్ల ద్వారా అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు. ఎస్‌ఐఆర్‌–2026 ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని వర్గాలు సహకరించాలని తెలిపారు.కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే వారు ఫారం–6, చిరునామా మార్పు కోసం ఫారం–7, మరణించిన లేదా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయిన ఓటర్లకు సంబంధించి ఫారం–8 అందజేసి, ప్రక్రియపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కీసర ఆర్డీఓ వెంకటరెడ్డి, ఏఈఆర్‌ఓ మధుసూదన్‌రెడ్డి, బీఎల్‌ఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News