[t4b-ticker]

సచిన్ సావంత్‌ను సన్మానించిన కవ్వంపల్లి

  • కరీంనగర్‌లో ఏఐసీసీ కార్యదర్శికి ఘన సన్మానం

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, ఆగస్టు 16: కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో పాల్గొనేందుకు ఆదివారం కరీంనగర్‌కు విచ్చేసిన ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌ను టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి సచిన్ సావంత్‌కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ బాబు, పార్టీ నాయకులు ఉట్కూరి నరేందర్ రెడ్డి, పులి కృష్ణ, గోపు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News