*నకిలీ ఎరువులు అమ్మితే లైసెన్స్ రద్దు, కేసులు తప్పవు – దుకాణదారులకు అధికారుల హెచ్చరిక .
ప్రతి పక్షం చండూరు సెప్టెంబర్ 28 : చండూరు మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.ఎరువుల దుకాణాల్లోని దస్త్రాలు, రికార్డులు, స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి B. వేణుగోపాల్ గారు, మండల వ్యవసాయ అధికారి P. మల్లేష్ గారు పాల్గొన్నారు.అన్ని రకాల ఎరువులకు సంబంధించి ఇన్వాయిసులు, బిల్లులు, స్టాక్ రిజిస్టర్లను అధికారులు పరిశీలించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు మాత్రమే అందించాలని దుకాణదారులను ఆదేశించారు. ఎవరైనా దుకాణదారులు నకిలీ ఎరువులు అమ్మినట్లు తేలితే వారి లైసెన్సులు రద్దు చేయడంతో పాటు, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు ఎవరైనా నకిలీ ఎరువులపై అనుమానం ఉంటే వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు.




























