సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి వేడుకలు. -చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి

ప్రతిపక్షం, కొమురవెల్లి, నవంబర్ 09: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో జనగామ నియోజకవర్గంలో ఇల్లులేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం కొమురవెల్లి మండలం ఐనాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగ వేడుకలను జరుపుకుంటూ ఆనందంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి నియోజకవర్గంలోని ప్రతిపేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే గొప్ప సంకల్పంతో నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. జనగామ నియోజకవర్గంలో ఏ ఒక్క పేద కుటుంబం కూడా గుడిసెల్లో, పెంకుటిళ్లలో నివసించే పరిస్థితి ఉండకూడదని, ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతున్నారని అన్నారు.

ఈ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి జనగామ నియోజకవర్గానికి అత్యధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కోరుతున్నారని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా కృషి చేస్తామని అన్నారు. సామాన్య కుటుంబాల మధ్యకు వెళ్లి వారితో కలిసి పండుగ జరుపుకోవడం, వారి సంతోషాల్లో భాగస్వాములు కావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ కొమురవెల్లి మండల అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, యూత్ కాంగ్రెస్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related News

Latest News