ఎల్‌నినో ప్రభావంతో కుదేలైన పత్తి రైతు

*కిలో పత్తి ఏరేందుకు రూ.14 కూలీ – ఆటో ఖర్చులు అదనంగా రైతుదే.

ప్రతి పక్షం, చండూరు అక్టోబర్ 05: 2026 ఖరీఫ్ (వానాకాలం) సీజన్‌లో సూపర్ ఎల్‌నినో (Super El Niño) ప్రతికూల ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని పత్తి రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల పంటలు కుదేలయ్యాయి. సాగు నీటి వనరులు లేని ఈ ప్రాంతంలో వర్షాధారంపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. అధికంగా పత్తి పంటనే సాగు చేస్తుంటారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురిస్తే ఊహించని రీతిలో దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు వర్షపాతం లోపించడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో పత్తి పంటపై తీవ్ర ప్రభావం చూపింది. గత సీజన్‌తో పోలిస్తే ఈ సారి పెరుగుదల అంతంత మాత్రంగానే ఉండటంతో దిగుబడి గణనీయంగా తగ్గే పరిస్థితి కనిపిస్తుంది.

*పెట్టుబడి బారెడు.. దిగుబడి మూరెడు
సీజన్ ఆరంభంలో కురిసిన వర్షాలను చూసి మే చివరి మాసం నుంచే వ్యవసాయ భూములను చదును చేసుకొని పత్తి విత్తనాలను విత్తారు. కురిసిన తేలికపాటి వర్షాలకు పెట్టిన విత్తనాలు మొలకెత్తాయి. ఆ తర్వాత ఎరువులు, పురుగు మందు, కూలీల ఖర్చులు గతంతో పోల్చుకుంటే పెట్టుబడి భారం పెరిగింది. ఎకరానికి సుమారుగా రూ.25 వేల పై చిలుకు వరకు పెట్టుబడి ఖర్చు వస్తుందని అంచనా.. కొలుకు తీసుకుంటే మరో రూ.15 వేలు అదనంగా ఖర్చు పెరిగే అవకాశం ఉంది.కానీ వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారటంతో దిగుబడిపై ప్రభావం చూపింది. ఎకరానికి 3 నుంచి 5 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి రావడం కష్టతరమే అన్నట్లుగా రైతులు ఆందోళన చెందుతున్నారు.కూలీలు చండూరు ,కనగల్,గుర్రంపోడ్ మండలాల నుండి పత్తి తీసేందుకు ఘట్టుపల్ , మునుగోడుకు వెళ్తున్నారు . కేజీ పత్తి తీస్తే రూ.14 చొప్పున కూలితో పాటు అదనంగా ఆటో రవాణా ఖర్చు సైతం రైతు భరించాల్సిన పరిస్థితి.

జిల్లా వ్యాప్తంగా గతేడాది ఖరీఫ్ సీజన్లో 5 లక్షల 96 వేల ఎకరాల పత్తి పంటను సాగు చేయగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ ద్వారా లక్షా 38 వేల 315 మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేశారు. ఈ ఏడాదిలో 5 లక్షల 93 వేల ఎకరాల పత్తి పంటను సాగు చేశారు. దిగుబడిని చూస్తే మాత్రం గతంలో కంటే సగం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

Spread the love

Related News

Latest News