39 మందికి పింఛన్లు మంజూరు.. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌కు సర్పంచ్ పవన్ కృతజ్ఞతలు
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ నవంబర్ 18: నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మక్కా భూపతిపూర్ గ్రామ సర్పంచ్ చెవిటి పవన్ అన్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సహకారంతో మెదక్ మండలంలో తమ గ్రామానికి అత్యధికంగా 39 పింఛన్లు మంజూరు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలోని నిరుపేదలకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చేతుల మీదుగా పింఛన్లు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, వృద్ధులు, దివ్యాంగులకు కలిపి మొత్తం 39 పింఛన్లు మంజూరు చేయడం పేద కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని పేర్కొన్నారు.పింఛన్ల ద్వారా నిరుపేదలకు ప్రతినెలా ఆర్థిక భరోసా లభించడంతోపాటు వారి జీవనానికి కొంత వెసులుబాటు కలుగుతుందని అన్నారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిరంతరం సహకరిస్తున్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌కు, జిల్లా అధికారులకు ఈ సందర్భంగా సర్పంచ్ చెవిటి పవన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.





























