SE నారాయణ నాయక్ ప్రత్యేక చొరవ తీసుకోవాలి – TRVKS జిల్లా అధ్యక్షులు జి. అశోక్ విజ్ఞప్తి
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ నవంబర్ 13: మెదక్ సర్కిల్ పరిధిలోని విద్యుత్ శాఖ ఉద్యోగుల్లో ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక స్పోర్ట్స్ కౌన్సిల్ బాడీ ఏర్పాటు చేయాలని TRVKS మెదక్ జిల్లా అధ్యక్షులు జి. అశోక్ కోరారు. ఈ మేరకు మెదక్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE) నారాయణ నాయక్ ప్రత్యేక చొరవ తీసుకొని ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. మెదక్ సర్కిల్ పరిధిలో క్రికెట్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్ తదితర క్రీడల్లో ప్రతిభ కలిగిన ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారని తెలిపారు. వారికి తగిన వేదిక, శిక్షణ, ప్రోత్సాహం కల్పిస్తే ఉన్నతస్థాయి పోటీల్లో రాణించే అవకాశం ఉంటుందన్నారు.
ప్రస్తుత స్పోర్ట్స్ కౌన్సిల్లో మెదక్ సర్కిల్‌కు తగిన ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు, క్రీడల్లో చురుకుగా పాల్గొనే ఉద్యోగులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. క్రీడలు ఉద్యోగుల మధ్య ఐక్యత, స్నేహభావం, క్రమశిక్షణ, ఆరోగ్యం, టీమ్ స్పిరిట్‌ను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.ప్రతి సర్కిల్‌కు సమాన ప్రాధాన్యత, అవకాశాలు కల్పించినప్పుడే క్రీడారంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మెదక్ సర్కిల్ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి, వారికి ఉన్నతస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశాలు కల్పించేలా ప్రత్యేక స్పోర్ట్స్ కౌన్సిల్ బాడీ ఏర్పాటుకు SE నారాయణ నాయక్ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.మెదక్ క్రీడాకారుల్లో ప్రతిభకు కొదవ లేదని, సరైన వేదిక, ప్రోత్సాహం, సమాన అవకాశాలు కల్పిస్తే మరింతగా రాణిస్తారని జి. అశోక్ ఆశాభావం వ్యక్తం చేశారు.



























